Enforcement Directorate: లిక్క‌ర్ స్కామ్ కేసులో హైద‌రాబాద్‌, ఢిల్లీ, పంజాబ్‌లో మ‌ళ్లీ ఈడీ దాడులు

Raids At 35 Places Across Delhi Punjab Hyderabad In Liquor Policy Case
  • 35 ప్రాంతాల్లో ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హిస్తున్న అధికారులు
  • ఈ  తెల్ల‌వారుజాము నుంచే నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లిన ఈడీ బృందాలు
  • డ‌ర్టీ పాలిటిక్స్ అంటూ కేంద్రంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శ‌
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వేగం పెంచింది. హైద‌రాబాద్‌, ఢిల్లీ, పంజాబ్‌లోని ప్ర‌దేశాల్లో శుక్ర‌వారం ఉద‌యం నుంచి మ‌రోసారి దాడులు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన వారికి చెందిన‌ ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారుల బృందాలు త‌మ ప్రధాన కార్యాలయం నుంచి ఈ తెల్ల‌వారుజామునే నిర్దేశిత  స్థానాలకు బయలుదేరాయి. కాగా, ఈ దాడుల‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై మ‌రోసారి విరుచుకుపడ్డారు. వీటిని "డర్టీ పాలిటిక్స్" అని విమ‌ర్శించారు. 

" మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో మూడు నెలల నుంచి 500 కంటే ఎక్కువ దాడులు, 300 పైచిలుకు మంది సీబీఐ/ఈడీ అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నారు. కానీ, ఇప్ప‌టిదాకా ఏదీ క‌నుగొన‌లేక‌పోయారు. ఎందుకంటే అక్క‌డ ఏ త‌ప్పూ జ‌ర‌గ‌లేదు. ఇంత మంది అధికారుల సమయాన్ని త‌మ‌ నీచ రాజకీయాల కోసం వృథా చేస్తున్నారు. ఇలాంటి దేశం ఎలా పురోగమిస్తుంది?" అని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు.
Enforcement Directorate
Delhi Liquor Scam
raids
Hyderabad
Delhi
35 places
Punjab
Arvind Kejriwal
BJP

More Telugu News