KCR: కేసీఆర్ కు 'బీఆర్ఎస్' సమస్య.. ఇప్పటికే ఈసీ వద్ద బీఆర్ఎస్ అప్లికేషన్లు

  • బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కేసీఆర్
  • ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో అప్లికేషన్లు
  • బీఆర్ఎస్ పేరు ఓటర్లను తికమకపెట్టే అవకాశం
4 BRS applications are with Election Commission

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ 'బీఆర్ఎస్'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా దేశ రాజకీయాల్లో కీలకపాత్రను పోషించాలని ఆయన భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించే పనుల్లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పేరు సమస్యను తీసుకొచ్చేలా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో నాలుగు పార్టీల అప్లికేషన్లు ఈసీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. 

సికింద్రాబాద్ నుంచి బహుజన రాష్ట్ర సమితి ఉంది. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీకి ఓడ గుర్తుతో ఈ పార్టీ పోటీ చేసింది. ముంబై నుంచి బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ, పూణె నుంచి భారతీయ రాష్ట్రీయ స్వదేశీ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి అప్లికేషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేటప్పుడు బీఆర్ఎస్ అనే పేరు ఓటర్లను తికమకపెట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సింబల్ కారును పోలిన గుర్తులు ఉండటం... ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.

More Telugu News