ఈ చిల్లర మాటలు కేజ్రీవాల్ మానసిక స్థితి ఎలా ఉందో చెబుతున్నాయి: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

06-10-2022 Thu 21:51
  • కేజ్రీవాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
  • ప్రేమలేఖగా అభివర్ణించిన కేజ్రీవాల్
  • తన భార్య కూడా ఆ విధంగా తిట్టదని వ్యంగ్యం
  • ఏడేళ్లలో కేజ్రీవాల్ చేసింది ఏమీలేదన్న తివారీ
  • ఇప్పుడిలా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం
BJP MP Manoj Tiwari slams Delhi CM Arvind Kejriwal
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖలను సీఎం కేజ్రీవాల్ ప్రేమలేఖలుగా అభివర్ణించడం తెలిసిందే. ఆ లేఖల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తనను ఘోరంగా తిడుతున్నారని, తన భార్య కూడా అలా తిట్టి ఉండదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తప్పుబట్టారు. 

ఈ చిల్లర భాష కేజ్రీవాల్ మానసిక స్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. ఈ ఏడేళ్లలో కేజ్రీవాల్ చేసింది ఏమీలేదని, కనీసం ఒక శాఖను కూడా నిర్వహించలేదని, కనీసం ఒక ఫైలుపై కూడా సంతకం చేయలేదని తివారీ మండిపడ్డారు. కేవలం దోచుకోవడం, అబద్ధాలు చెప్పడంపైనే శ్రద్ధ చూపించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడిలా దిగజారి చవకబారుతనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తివారీ ట్వీట్ చేశారు.