పిల్లల సంతోషం కోసం... ధనుష్, ఐశ్వర్యలను ఒప్పించిన రజనీకాంత్...?

06-10-2022 Thu 20:39
  • గత జనవరిలో విడాకుల ప్రకటన చేసిన ధనుష్, ఐశ్వర్య
  • విడాకుల నిర్ణయం రద్దు చేసుకున్నట్టు తాజా కథనాలు
  • వారిని రజనీకాంత్ ఒప్పించారంటూ సరికొత్త కథనం
Is Rajinikanth convince his daughter and Dhanush
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ గత జనవరిలో విడాకుల ప్రకటన చేయడం సంచలనం సృష్టించింది. వీరికి యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తాజాగా, ధనుష్, ఐశ్వర్య తమ విడాకులు రద్దు చేసుకున్నట్టు జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. 

అయితే, వీరి విడాకుల రద్దు నిర్ణయం వెనుక రజనీకాంత్ ప్రోద్బలం ఉందని ఓ సరికొత్త కథనం వెలువడింది. ఆ కథనం ప్రకారం.... ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర అశాంతితో ఉంటున్నారు. విభేదాలను పక్కనబెట్టి కనీసం పిల్లల కోసమైనా విడాకులపై పునరాలోచించుకోవాలని రజనీకాంత్ తన అల్లుడు ధనుష్ కు, కుమార్తె ఐశ్వర్యకు సూచించారు. నీకు నీ సంతోషం ముఖ్యమా, లేక ఇద్దరు పిల్లల సంతోషం ముఖ్యమా? అంటూ కుమార్తెను అడిగినట్టు తెలిసింది.

ధనుష్, ఐశ్వర్యలతో చెన్నై పొయెస్ గార్డెన్ లో కుటుంబ పరమైన సమావేశం ఏర్పాటు చేసి వారిద్దరికీ హితబోధ చేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. ఏదేమైనా రజనీ ప్రయత్నాలు ఫలించి ధనుష్, ఐశ్యర్య మళ్లీ వైవాహిక జీవితం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.