Om Raut: రామాయణాన్ని పూర్తిగా ఇస్లామీకరించారు: 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ కు నోటీసులు

  • ప్రభాస్ ప్రధాన పాత్రలో 'ఆదిపురుష్'
  • ఇటీవలే టీజర్ రిలీజ్
  • సర్వ బ్రాహ్మణ మహాసభ ఆగ్రహం
  • రామాయణ పాత్రలను తప్పుగా చూపించారని ఆరోపణ
Notices to Adipurush director Om Raut

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే, ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా, అప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల రూపురేఖల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కు సర్వ బ్రాహ్మణ మహాసభ నోటీసులు పంపింది. సర్వ బ్రాహ్మణ మహాసభ జాతీయ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా తరఫున న్యాయవాది కమలేశ్ శర్మ నోటీసులు పంపారు. ఆదిపురుష్ చిత్రంలోని అభ్యంతకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపట్ల క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

"ఈ సినిమాలో హిందూ దేవుళ్లను, దేవతలను తప్పుగా చూపించారు. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది. తోలుదుస్తులు ధరించి, అమర్యాదకరంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో చాలా అల్పస్థాయి భాష ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇదంతా మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, దెబ్బతీయడమే. మత, కుల పరమైన విద్వేషాలు రగిల్చేలా ఈ చిత్రంలోని డైలాగులు ఉన్నాయి. 

రామాయణం మన చరిత్ర, మన స్ఫూర్తి. కానీ ఆదిపురుష్ లో అందుకు విరుద్ధంగా ఉంది. హనుమంతుడు ఓ మొఘల్ లా కనిపిస్తున్నాడు. హిందువులు మీసాల్లేకుండా గడ్డాలు పెంచరు. కానీ ఈ సినిమాలో హనుమంతుడ్ని ఆ విధంగా చూపించారు. రామాయణాన్ని, రాముడ్ని, సీతను, హనుమంతుడ్ని ఇస్లామీకరించడమే ఈ సినిమా ఉద్దేశంలా ఉంది" అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

More Telugu News