టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా పయనమైన టీమిండియా

06-10-2022 Thu 17:59
  • అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్ కప్
  • ఆసీస్ గడ్డపై మెగా టోర్నీ
  • ముందుగానే ఆసీస్ లో అడుగుపెడుతున్న భారత్
  • ఈ నెల 23న తొలి మ్యాచ్ ఆడనున్న రోహిత్ సేన
Team India leaves for T20 World Cup in Australia
అక్టోబరు 16 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు టీమిండియా నేడు ఆస్ట్రేలియా పయనమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఈ ఉదయం విమానమెక్కింది. 

ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 23న పాకిస్థాన్ తో ఆడనుంది. భారత్ నేరుగా సూపర్-12 దశలో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్ ముందుగానే బయల్దేరింది. ఐసీసీ మెగా టోర్నీకి ముందు భారత్ ఆసీస్ గడ్డపై పలు వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. 

కాగా, ఆస్ట్రేలియా బయల్దేరేముందు టీమిండియా గ్రూప్ ఫొటోను బీసీసీఐ పంచుకుంది. "పిక్చర్ పర్ఫెక్ట్... లెట్స్ డూ దిస్ టీమిండియా" అంటూ క్యాప్షన్ పెట్టింది. "క్రికెట్ వరల్డ్... ఇదిగో మేం వచ్చేస్తున్నాం" అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.