పథకాలు కావాలంటే జగన్ కు ఓటేయమని అడుగుతాం: వైవీ సుబ్బారెడ్డి

06-10-2022 Thu 17:51
  • కొత్తగా ఏ పార్టీ వచ్చినా వైసీపీకి ఇబ్బంది లేదు
  • జగన్ సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష
  • జగన్ ఫొటో పెట్టుకునే జనాల్లోకి వెళ్తాం
YV Subba Reddy response on BRS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని వైసీపీ నేతలు చెపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. ఏ పార్టీ వచ్చినా వైసీపీకి ఇబ్బంది లేదని... జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష అని అన్నారు. కొత్తగా ఎవరొచ్చినా ఇంత కంటే చేసేది ఏముంటుందని ప్రశ్నించారు. 

జగన్ ఫొటో పెట్టుకునే జనాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతామని... ప్రస్తుతం అమలవుతున్న పథకాలు కొనసాగాలంటే జగన్ కు ఓటేయమని అడుగుతామని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏముందని ప్రశ్నించారు.