టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా...మ‌రికాసేప‌ట్లో ద‌క్షిణాఫ్రికాతో తొలి వ‌న్డే

06-10-2022 Thu 15:44
  • ల‌క్నో వేదిక‌గా తొలి వ‌న్డే మ్యాచ్‌
  • వ‌ర్షం కార‌ణంగా 40 ఓవ‌ర్ల‌కు మ్యాచ్‌ కుదింపు
  • రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ధావ‌న్‌
team india won the toss and elected bowl first in first odi with south africa
భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టుతో టీమిండియా తొలి వ‌న్డే మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ల‌క్నోలోని అట‌ల్ బిహరీ వాజ్‌పేయి స్టేడియంలో జ‌రగ‌నున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ప‌ర్యాట‌క జ‌ట్టును ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వాస్త‌వానికి ఈ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్నా... వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా మ్యాచ్ జ‌రుగుతోంది. 

మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో 40 ఓవ‌ర్ల‌కే మ్యాచ్ ను కుదించారు. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి నేపథ్యంలో బీసీసీఐ ధావ‌న్‌కు కెప్టెన్సీ అప్ప‌గించింది. మొత్తం 3 మ్యాచ్‌ల‌తో కూడిన ఈ సిరీస్‌లో తొలి వ‌న్డే నేడు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా వ‌న్డే సిరీస్‌లోనూ ఫేవ‌రెట్‌గా బరిలోకి దిగుతోంది.