Chandrababu: సూర్యలంక బీచ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

Chandrababu responds to Suryalanka beach tragedy
  • బీచ్ లో విహారానికి వచ్చిన విజయవాడ యువకులు
  • ఆరుగురి మృతి
  • ఈ ఘటన కలచివేసిందన్న చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన టీడీపీ అధినేత
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో గల్లంతైన ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీచ్ లో విహారానికి వెళ్లి విజయవాడ సింగ్ నగర్ కు చెందిన యువకులు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారని పేర్కొన్నారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాలకు అపార నష్టం జరిగిందని వివరించారు. పండుగవేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే, మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Suryalanka Beach
Youth
Death
Vijayawada

More Telugu News