ద‌త్త‌న్న అల‌య్ బ‌ల‌య్‌లో సంద‌డి చేసిన చిరంజీవి

  • నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో అల‌య్ బ‌ల‌య్‌
  • డోలు వాయిస్తూ డ్యాన్స్ చేసిన చిరంజీవి
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ ఏపీ, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్లు
megastar chiranjeevi attends alay balay in hyderabad

ద‌స‌రా వేడుక‌ల సంద‌ర్భంగా హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో గురువారం అల‌య్ బ‌ల‌య్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల‌కు ద‌త్త‌న్న ఆహ్వానం మేర‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజ‌య్యారు. గురువారం సాయంత్రం దాకా సాగ‌నున్న ఈ వేడుక‌ల‌కు ఏపీ, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్లు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్, హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో పాటు కిష‌న్ రెడ్డి స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు.

అల‌య్ బ‌ల‌య్ వేడుక‌ల‌కు వ‌చ్చిన చిరంజీవి కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు. ద‌త్తాత్రేయ‌తో క‌లిసి మెడ‌లో డోలు వేసుకుని చిరంజీవి ఉత్సాహంగా డోలు వాయించారు. డోలు వాయిద్యానికి అనుగుణంగా ఆయ‌న డ్యాన్స్ కూడా చేశారు. డోలు వాయిస్తూ డ్యాన్స్ చేస్తున్న చిరుతో కార్య‌క్ర‌మంలో ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు కూడా డోలు వాయిస్తూ సంద‌డి చేశారు.

More Telugu News