Team India: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై కమ్ముకున్న నీలినీడలు

Rain may effect Lucknow ODI
  • ఈరోజు ప్రారంభం కావాల్సిన తొలి వన్డే
  • వర్షం కారణంగా ఇంత వరకు పడని టాస్
  • భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శిఖర్ ధావన్
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి వన్డే లక్నోలో కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. లక్నోలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, పిచ్ పై కవర్లను కప్పారు. పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ మొత్తం వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ వన్డే సిరీస్ కు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు పయనమయింది. 

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. తొలి వన్డేకు సంబంధించి ఒంటి గంటకే టాస్ పడాల్సి ఉన్నప్పటికీ.... వర్షం కారణంగా ఇంత వరకు పడలేదు. భారత జట్టులో ధావన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ ఉన్నారు.
Team India
South Africa
ODI

More Telugu News