Rakheem Cornwall: 77 బంతుల్లో రెండు సెంచరీలు కొట్టిన వెస్టిండీస్ ఆల్ రౌండర్

  • టీ20ల్లో డబుల్ సెంచరీతో రికార్డ్
  • 22 సిక్సర్లు, 17 బౌండరీల మోత
  • క్రీజ్ నుంచి కదలకుండానే 200 పరుగులు
West Indies all rounder Rakheem Cornwall smashes 77 ball 205 in American T20 competition

వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్ వాల్ బ్యాట్ తో రికార్డులను బద్దలు కొట్టాడు. అట్లాంటా ఓపెన్ (అమెరికా టీ20 కాంపిటిషన్)లో భాగంగా జరిగిన మ్యాచ్ లో కేవలం 77 బంతుల్లో 205 పరుగులు సాధించాడు. అట్లాంటా ఫైర్ జట్టు తరఫున ఆడిన అతడు.. వచ్చిన బంతిని వచ్చినట్టు చీల్చి చెండాడి తన బ్యాటింగ్ పవర్ ను మరోసారి క్రికెట్ ప్రియులకు చూపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓపెనర్ గా కార్న్ వాల్ కు మంచి పేరుంది. 

మ్యాచ్ లో భాగంగా కార్న్ వాల్.. 22 బంతులను సిక్సర్లుగా మలిచాడు. 17 బంతులను బౌండరీలకు పంపాడు. అంటే 200 పరుగులను అతడు వికెట్ల మధ్య పరుగులు తీయకుండానే సాధించాడు. కార్న్ వాల్ భారీ కాయంతో ఉంటాడు. దీంతో వికెట్ల మధ్య పరుగులు తీసే అవసరం ఏర్పడకుండా క్రీజులోనే ఉండి తన బ్యాటింగ్ పవర్ ను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. టీ20ల్లో డబుల్ సెంచరీతో కార్న్ వాల్ రికార్డు నమోదు చేశాడు. తాను 360 డిగ్రీల్లో ఆడగలిగే ఆటగాడినని కార్న్ వాల్ పేర్కొన్నాడు. తన సిక్సర్ల బాదుడు చాలా సహజమేనని తెలిపాడు.

More Telugu News