Abhiram: దగ్గుబాటి అభిరామ్ 'అహింస' .. టీజర్ రిలీజ్!

  • తేజ నుంచి వస్తున్న 'అహింస'
  • హీరోగా రానా తమ్ముడి పరిచయం 
  • హీరోయిన్ గీతికకు ఇదే ఫస్టు మూవీ 
  • ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ 
  • త్వరలోనే థియేటర్లకు రానున్న సినిమా
Ahimsa teaser released

హీరోగా రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ 'అహింస' సినిమాతో పరిచయమవుతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా తేజకి మంచి పేరు ఉంది. ప్రేమకథా చిత్రాలతో కొత్త ట్రెండును క్రియేట్ చేసిన రికార్డు ఉంది. అలాంటి ఆయన నుంచి మరో ప్రేమకథగా ఈ సినిమా రాబోతోంది. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ అనే విషయం ఈ టీజర్ ద్వారా అర్థమవుతోంది. రఘు - అహల్య బావా మరదళ్లు. ఒకరంటే ఒకరికి ఇష్టం .. ప్రేమ. అమాయకుడైన రఘును అహల్య అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. అలాంటివారి జీవితం అల్లకల్లోలమవుతుందనే విషయాన్ని టీజర్ చెబుతోంది. 

అందుకు కారకులు ఎవరు? ఆ పరిస్థితులను ఆ ప్రేమికులు ఎలా తట్టుకుని నిలబడ్డారు? అనేదే కథ అనే విషయం స్పష్టమవుతోంది. కథానాయికగా ఈ సినిమాతో గీతిక పరిచయమవుతోంది. సదా .. రజత్ బేడీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. గతంలో తేజ కాంబినేషన్లో ఆయన అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News