Kollywood: కాబోయే భార్యను పరిచయం చేసిన కోలీవుడ్ యువ నటుడు హరీశ్ కల్యాణ్

Tamil actor Harish Kalyan to tie the knot with Narmada Udayakumar
  • త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హరీశ్ కల్యాణ్
  • నర్మదా ఉదయ్ కుమార్‌తో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నట్టు వెల్లడి
  • మీ ఆశీస్సులు కావాలంటూ ఫొటోలు షేర్ చేసిన నటుడు
కోలీవుడ్ యువ నటుడు హరీశ్ కల్యాణ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. నిన్న దసరా పండుగను పురస్కరించుకుని కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. నటుడిగా తన కెరియర్ మొదలైనప్పటి నుంచి అభిమానులు తనను ఎంతగానో సపోర్ట్ చేశారని, తనపై ప్రేమాభిమానాలు కురిపించి తనను ఈ స్థాయికి తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. నర్మదా ఉదయ్ కుమార్‌తో త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నానని పేర్కొన్నాడు. తమ జంటకు మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా కాబోయే భార్య నర్మదతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. వాటిని చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు హరీశ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘సింధు సమవేలి’ సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హరీశ్ ఆ సినిమాలో అద్భుతంగా నటించి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత చేసిన ‘ప్యార్ ప్రేమ కాదల్’, ‘ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం’ వంటి చిత్రాలు హరీశ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. అలాగే, తెరకెక్కిన ‘కాదలి’లో హరీశ్ కథానాయకుడిగా నటించాడు. నాని సినిమా ‘జెర్సీ’లో యంగ్ నానిగా కనిపించాడు.
Kollywood
Harish Kalyan
Narmada Udayakumar

More Telugu News