ఢిల్లీ రాంలీలా మైదానంలో రావ‌ణ సంహారంలో పాల్గొన్న ప్ర‌భాస్... వీడియో ఇదిగో

05-10-2022 Wed 20:49
  • ఆదిపురుష్‌లో రాముడిగా క‌నిపించ‌నున్న ప్ర‌భాస్‌
  • రావణ ద‌హ‌న వేడుక‌కు ప్ర‌భాస్‌ను ఆహ్వానించిన రాంలీలా క‌మిటీ
  • విల్లు ఎక్కుపెట్టి బాణం వ‌దిలిన ప్ర‌భాస్‌
prabhas participates ravan dahan at ramleela maiden in delhi
టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌... దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన రావ‌ణ సంహారానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రావ‌ణ సంహారంలో భాగంగా ఆయ‌న విల్లుతో బాణాన్ని సంధించారు. రాంలీలా క‌మిటీ ఆహ్వానం మేర‌కే ఆయ‌న ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మైదానానికి ప్ర‌భాస్ రావ‌డానికి ముందే ఈ వేడుక‌లకు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హాజ‌ర‌య్యారు.

రామాయ‌ణం ఇతివృత్తంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా రెండేళ్ల నుంచి రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌నం వేడుక‌లు జ‌ర‌గ‌లేదు. దీంతో ఈ ఏడాది ఈ వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించిన రాంలీలా క‌మిటీ... వేడుక‌కు ప్ర‌భాస్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే.