విడాకులు ర‌ద్దు చేసుకునే దిశ‌గా ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌... నెట్టింట వైర‌ల్ అవుతున్న వార్త‌

  • 2004లో వివాహం చేసుకున్న ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌
  • 2022 జ‌న‌వ‌రిలో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • విడాకులు ర‌ద్దు చేసుకుంటున్నట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు
Dhanush And Aishwarya Decide to Call Off Divorce After 9 Months

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ విడాకుల‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారంటూ ఓ వార్త బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్‌గా మారిపోయింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఉన్న‌ట్టుండి ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు విడిపోయేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఆ వెంట‌నే విడాకుల‌కు కూడా వారు ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కార‌ణం ఏమిటో చెప్ప‌కుండా విడిపోయేందుకు సిద్ధ‌మైన వీరిద్ద‌రినీ తిరిగి క‌లిపేందుకు రెండు కుటుంబాల స‌భ్యులు తీవ్రంగా చేసిన య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌లు విడిపోవ‌డం ఖాయ‌మైపోయింది.

2003లో ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వ‌ర్య‌ను ధ‌నుష్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు కూడా ఉన్నారు. విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న నేప‌థ్యంలో పిల్ల‌లిద్ద‌రూ ధ‌నుష్ వ‌ద్దే ఉంటున్నారు. అయితే ఏమైందో తెలియ‌దు గానీ... కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసిన విడాకుల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా బుధ‌వారం వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై అటు ధ‌నుష్ ఫ్యాన్స్‌తో పాటు ర‌జ‌నీ అభిమానులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై అటు ధ‌నుష్ గానీ, ఇటు ఐశ్వ‌ర్య గానీ స్పందించ‌లేదు. దీంతో ఈ వార్త‌ల విశ్వ‌స‌నీయ‌త‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

More Telugu News