మందు పార్టీపై ప‌డిన పిడుగు... వ‌రంగ‌ల్ జిల్లాలో ముగ్గురు యువ‌కులు మృతి

05-10-2022 Wed 20:24
  • వ‌రంగ‌ల్ జిల్లా వర్ధ‌న్న‌పేట మండ‌లం బండౌత‌పురంలో ఘ‌ట‌న‌
  • పిడుగుపాటుకు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ముగ్గురు యువ‌కులు
  • గాయ‌ప‌డ్డ ఇద్ద‌రిని వ‌ర్ధ‌న్న‌పేట ఆసుప‌త్రికి త‌ర‌లింపు
ద‌స‌రా వేళ తెలంగాణ‌లోని ఓ గ్రామ శివారులో జ‌రుగుతున్న మందు పార్టీపై పిడుగు ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా... మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను వ‌ర్ధ‌న్న‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పండగ పూట ముగ్గురు యువ‌కులు పిడుగుపాటుకు గురై చ‌నిపోవ‌డంతో గ్రామంలో విషాదం నెల‌కొంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... వ‌రంగ‌ల్ జిల్లా వర్ధ‌న్న‌పేట మండ‌లం బండౌత‌పురం గ్రామానికి చెందిన యువ‌కులు గ్రామ శివారులో ద‌స‌రా సంబ‌రాల్లో భాగంగా మ‌ద్యం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులంతా క‌లిసి మ‌ద్యం తాగుతున్న వేళ‌..ఉన్న‌ట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజ‌రైన ముగ్గురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు.