Rupay: రూపే క్రెడిట్​ కార్డుల నుంచి ఉచితంగా యూపీఐ పేమెంట్లు.. లిమిట్​ మాత్రం రూ.2వేలే!

  • ఇప్పటివరకు యూపీఐకి బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులతోనే లింకు
  • క్రెడిట్ కార్డుల ద్వారా కూడా యూపీఐ లావాదేవీలకు ఇటీవల రిజర్వు బ్యాంకు పచ్చజెండా
  • మొదట రూపే క్రెడిట్ కార్డులతో అమల్లోకి..
No charge for rupay credit card use on UPI transaction

రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు మొదలైందని.. అయితే అందులో రూ.2 వేల వరకు చేసే లావాదేవీలపై మాత్రం ఎటువంటి చార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల మేరకు.. దేశీయంగా అభివృద్ధి చేసిన పేమెంట్‌ గేట్‌ వేను ప్రోత్సాహించే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

అన్ని బ్యాంకుల నుంచి రూపే కార్డులు
మన దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ కూడా రూపే ఆధారిత క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా ఈ రూపే కార్డులు వాడుకలో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు యూపీఐ పేమెంట్ల కోసం వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. 

అయితే సాధారణంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు.. సదరు దుకాణ దారుల నుంచి బ్యాంకులు ఒకటి నుంచి రెండు శాతం వరకు ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) చార్జీలను వసూలు చేస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులకు ఈ చార్జీలు ఎక్కువ. అయితే ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ చార్జీలను వసూలు చేయబోమని ఎన్సీపీఐ   ప్రకటించింది.

More Telugu News