ద‌స‌రా రోజున ముఖేశ్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్‌

05-10-2022 Wed 18:20
  • రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ఆసుప‌త్రి ల్యాండ్ లైన్‌కు బెదిరింపు ఫోన్ కాల్‌
  • ఆసుపత్రిని పేల్చేస్తామన్న గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు
  • ముఖేశ్ కుటుంబంలోని కొంద‌రిని చంపేస్తామంటూ బెదిరింపు
  • కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు మొద‌లుపెట్టిన పోలీసులు
threatening call tomukesh ambani again
విజ‌య ద‌శ‌మి ప‌ర్వ‌దినాన బుధ‌వారం యావ‌త్తు దేశ ప్ర‌జ‌లు వేడుక‌లు జ‌రుపుకుంటున్న వేళ‌...భారత పారిశ్రామిక దిగ్గ‌జం రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ కుటుంబానికి బెదిరింపులు ఎదుర‌య్యాయి. ముంబైలోని రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ఆసుప‌త్రికి చెందిన ల్యాండ్ లైన్ నెంబ‌రుకు ఫోన్ చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు... ఆసుప‌త్రిని పేల్చేస్తామ‌ని, ముఖేశ్ కుటుంబంలోని కొంద‌రిని చంపేస్తామంటూ చెప్పారు. 

ఈ బెదిరింపు ఫోన్ కాల్స్‌పై స‌మాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. గ‌తంలోనూ ఇదే ఆసుప‌త్రికి ఫోన్ చేసిన ఓ వ్య‌క్తి ముఖేశ్ అంబానీని చంపేస్తామంటూ బెదిరించాడు. ఆ త‌ర్వాత ఆ ఫోన్ కాల్ చేసిన వ్య‌క్తిని ద‌హిస‌ర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. తాజాగా అదే త‌ర‌హాలో ముఖేశ్ కుటుంబానికి బెదిరింపు కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం. ముఖేశ్ కు పొంచి ఉన్న ముప్పు నేప‌థ్యంలో ఇటీవ‌లే ఆయ‌న భద్ర‌త‌ను కేంద్ర ప్ర‌భుత్వం జెడ్ ప్ల‌స్ కేట‌గిరీకి పెంచిన సంగ‌తి తెలిసిందే.