ద‌స‌రా ప‌ర్వ‌దినాన క‌ర్ణాట‌క ఆల‌యంలో సోనియా గాంధీ ప్ర‌త్యేక పూజ‌లు

05-10-2022 Wed 17:47
  • క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న రాహుల్ పాద‌యాత్ర‌
  • యాత్ర‌కు రెండు రోజుల పాటు విరామం ఇచ్చిన రాహుల్
  • కుమారుడిని క‌లిసేందుకు క‌ర్ణాట‌క వ‌చ్చిన సోనియా
  • భీమ‌న‌కొల్లి మ‌హ‌దేశ్వరాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన వైనం
sonia gandhi visits Bhimanakolli Mahadeshwara temple in karnataka on vijaya dashami
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ బుధ‌వారం క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సోనియా కుమారుడు, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం క‌ర్ణాట‌కలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని యాత్ర‌కు రాహుల్ గాంధీ 2 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఈ క్ర‌మంలో కుమారుడిని క‌లిసేందుకు సోనియా క‌ర్ణాట‌క వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

విజ‌య ద‌శ‌మి నాడే క‌ర్ణాట‌క వ‌చ్చిన సోనియా గాంధీ... బెంగ‌ళూరు, హోసూరు మ‌ధ్య‌లో ఉన్న బెంగూరులోని భీమ‌న‌కొల్లి మ‌హ‌దేశ్వ‌రాల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మ‌హ‌దేశ్వ‌రుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన సోనియా గాంధీ... ఆల‌యంలో హార‌తి అందుకుని ప్ర‌సాదం స్వీక‌రించారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఆమె కాసేపు కూర్చున్నారు.