నెల్లూరు నుంచి చెన్నైకి రైలులో ప్రయాణించిన వెంక‌య్య‌... వీడియో ఇదిగో

05-10-2022 Wed 17:31
  • ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించిన వెంక‌య్య‌
  • గూడూరు రైల్వే స్టేష‌న్‌లో రైలెక్కిన మాజీ ఉప‌రాష్ట్రప‌తి
  • ధ‌నాపూర్‌-బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి బయ‌లుదేరిన వైనం
ex vice president venkaiah naidu travels in trail from nellore to chennai
భార‌త మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు బుధ‌వారం రైలులో ప్రయాణించారు. గ‌డ‌చిన రెండు రోజులుగా త‌న సొంత జిల్లా నెల్లూరు వ‌చ్చిన వెంక‌య్య‌... ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో బిజీబిజీగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఏర్పాటు చేసిన స‌న్మాన స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకున్న వెంక‌య్య చెన్నై బ‌య‌లుదేరి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైలు ప్ర‌యాణాన్ని ఆశ్ర‌యించారు. నెల్లూరు జిల్లాలోని గూడురు రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్న వెంక‌య్య‌కు అక్క‌డి స్థానికులు వీడ్కోలు చెప్ప‌గా... రైల్వే స్టేష‌న్‌లో ఆయ‌న కొద్దిసేపు రైలు కోసం వేచి చూశారు. ధ‌నాపూర్‌-బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్ రైలు రాగానే...అందులోకి ఎక్కిన వెంక‌య్య చెన్నై బ‌య‌లుదేరి వెళ్లిపోయారు.