ఢిల్లీలోని అద్దె భ‌వ‌నంలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాల‌యం

05-10-2022 Wed 17:17
  • ఢిల్లీలో నిర్మాణంలో టీఆర్ఎస్ కార్యాల‌యం
  • స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో ఓ భ‌వ‌నాన్ని లీజుకు తీసుకున్న టీఆర్ఎస్‌
  • అందులోనే పార్టీ తాత్కాలిక కార్యాల‌యం ఏర్పాటు
  • అద్దె భ‌వ‌నానికి బీఆర్ఎస్ రంగులు అద్దిన వైనం
brs iemperary office will be in a leased building in delhi
జాతీయ పార్టీగా అవ‌త‌రించిన భార‌త్ రాష్ట్ర పార్టీ(బీఆర్ఎస్‌) కార్యాల‌యం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏర్పాటు కానుంది. ఢిల్లీలోని స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లోని ఓ భ‌వ‌నంలో బీఆర్ఎస్ కార్యాల‌యం ఏర్పాటు కానుంది. లీజుకు తీసుకున్న ఈ భ‌వ‌నంలో బీఆర్ఎస్ కొంత‌కాలం పాటు కొన‌సాగ‌నుంది. ఇటీవ‌లి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాల‌యం కోసం ఈ భ‌వ‌నాన్ని ఎంపిక చేయ‌గా... టీఆర్ఎస్ నేత‌లు స‌ద‌రు భ‌వ‌నాన్ని లీజుకు తీసుకున్నారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో పార్టీ కార్యాల‌య నిర్మాణ ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ భ‌వ‌న నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యేదాకా స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో అద్దెకు తీసుకున్న భ‌వ‌నంలో బీఆర్ఎస్ కార్యాల‌యం కొన‌సాగ‌నుంది. ఈ మేర‌కు అద్దెకు తీసుకున్న ఈ భ‌వ‌నానికి ఇప్ప‌టికే బీఆర్ఎస్ రంగులు అద్దిన‌ట్లు స‌మాచారం.