కెమిస్ట్రీలో నోబెల్ పుర‌స్కారం... ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు అవార్డు

05-10-2022 Wed 15:45
  • కెమిస్ట్రీలో ప‌రిశోధ‌న‌ల‌కు నోబెల్ పుర‌స్కారం
  • ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్
  • ఎల్లుండి నోబెల్ శాంతి బ‌హుమ‌తి ప్ర‌కట‌న‌
The Royal Swedish Academy of Sciences announces The Nobel Prize for click chemistry
ర‌సాయ‌న శాస్త్రంలో విశేష ప‌రిశోధ‌న‌లు చేసిన ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు రసాయ‌న శాస్త్ర విభాగంలో నోబెల్ బ‌హుమ‌తులకు ఎంపిక‌య్యారు. క‌రోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టిన్ మెల్డ‌ల్‌. బ్యారీ షార్ప్‌లెస్‌ లు ఈ ఏడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బ‌హుమ‌తికి ఎంపికయ్యారు. క్లిక్ కెమిస్ట్రీ, బ‌యో ఆర్థోగోన‌ల్ కెమిస్ట్రీలో విశేష ప‌రిశోధ‌న‌లు చేసినందుకు గానూ వీరిని నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక చేసిన‌ట్లు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్ బుధ‌వారం వెల్ల‌డించింది. షార్ప్‌లెస్, మెల్డ‌ల్‌లు తొలుత క్లిక్ కెమిస్ట్రీకి జీవం పోయ‌గా... బెర్టోజిల్ దానిని దైనందిన జీవితంలో వినియోగప‌డేలా అభివృద్ధి చేశారు. 

ఇప్ప‌టికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌గా... తాజాగా ర‌సాయ‌న శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తిపై ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. భౌతిక శాస్త్రంలో మాదిరే ర‌సాయ‌న శాస్త్రంలోనూ ముగ్గురు శాస్త్రవేత్త‌లు ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తిని స‌మానంగా పంచుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఎల్లుండి (శుక్రవారం) ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించే నోబెల్ శాంతి బ‌హుమ‌తి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.