కేసీఆర్‌ను ఆదిపురుష్‌తో పోలుస్తూ గ్రీటింగ్స్ చెప్పిన రాంగోపాల్ వ‌ర్మ‌

  • కేసీఆర్ ప్ర‌క‌ట‌న మ‌రుక్ష‌ణ‌మే సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించిన వ‌ర్మ‌
  • టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి ఆదిపురుష్‌గా కేసీఆర్ నిలిచార‌ని వ్యాఖ్య‌
  • కేసీఆర్‌కు జాతీయ రాజ‌కీయాల్లోకి స్వాగ‌తం అంటూ కామెంట్‌
cine direector ram gopal varma hails kcr as adipurush

నిన్న‌టిదాకా ఓ రాష్ట్ర పార్టీగానే ఉన్న టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీగా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. వైరి వ‌ర్గాలు మిన‌హాయిస్తే... దాదాపుగా అన్ని వ‌ర్గాల నుంచి కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కేసీఆర్ పార్టీని జాతీయ రాజ‌కీయాల్లోకి ఆహ్వానిస్తూ ప‌లువురు నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నిత్యం వివాదాల‌తోనే దోస్తీ చేస్తున్న సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ కూడా కేసీఆర్ జాతీయ పార్టీపై హర్షం వ్య‌క్తం చేశారు.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే సోష‌ల్ మీడియా వేదిక‌గా రాంగోపాల్ వ‌ర్మ స్పందించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ ఆదిపురుష్‌గా నిలిచారు. ఈ త‌రహా ప్ర‌యోగం చేసిన తొలి నేత‌గా కేసీఆర్ నిలిచార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంత‌టితో ఆగ‌ని వ‌ర్మ‌... జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్‌కు స్వాగ‌తం ప‌లికారు.

More Telugu News