Twitter: మ‌న‌సు మార్చుకున్న మ‌స్క్‌.. ట్విట్ట‌ర్ కొనుగోలు డీల్ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం

  • ఏప్రిల్‌లో ట్విట్ట‌ర్ మొత్తాన్ని కొంటాన‌ని ప్ర‌క‌టించిన టెస్లా అధినేత 
  • ఒక్కో షేరుకు 54.20 డాల‌ర్లు ఇస్తాన‌ని చెప్పి, త‌ర్వాత‌ వెన‌క్కి త‌గ్గిన ఎల‌న్ మ‌స్క్
  • తాజాగా అదే ధ‌ర‌కు డీల్ పూర్తి చేద్దామ‌ని ట్విట్ట‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌  
  • ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత భారీగా పెరిగిన ట్విట్ట‌ర్ షేర్ 
Elon Musk is finally buying Twitter

టెస్లా అధినేత ఎల‌న్ మ‌స్క్ మ‌న‌సు మార్చుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి మ‌ళ్లీ రెడీ అయ్యారు.  న్యాయ వివాదాన్ని కొన‌సాగించ‌కుండా.. ఈ డీల్‌ను ఎలాగైనా పూర్తి చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ ఏప్రిల్‌లో ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున‌ 44 బిలియన్ డాలర్లకు (రూ.3.50 లక్షల కోట్లు) ట్విట్టర్‌ను వంద శాతం కొనుగోలు చేస్తున్నట్లు మ‌స్క్ ప్ర‌క‌టించారు. కానీ, త‌ర్వాత ఈ డీల్ ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు తెలిపి అంద‌రికీ షాకిచ్చారు. 

దీనివ‌ల్ల త‌మ కంపెనీ షేర్లు న‌ష్ట‌పోయాయ‌ని మ‌స్క్ పై ట్విట్ట‌ర్ న్యాయ పోరాటం చేస్తోంది. కొన్ని నెల‌ల ప్ర‌తిష్ఠంభ‌న త‌ర్వాత ఇరు పార్టీల మ‌ధ్య రాజీ కుదిరిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో చెప్పిన‌ట్లే ట్విట్టర్ లో ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని మ‌స్క్‌ ప్రతిపాదన చేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ కూడా నిర్థారించింది. వీలైనంత త్వ‌ర‌గా డీల్‌ను పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌స్క్ ప్ర‌తిపాద‌న త‌ర్వాత  ట్విట్టర్ షేరు భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 22 శాతం మేర పెరిగి 52 డాలర్ల వద్ద స్థిరపడింది.

More Telugu News