Prabhas: ఆదిపురుష్ ద‌ర్శ‌కుడిపై ప్ర‌భాస్ ఆగ్ర‌హంగా ఉన్నాడా? వీడియో చూడండి..

Was Prabhas angry at Adipurush director Om Raut at teaser launch  This video suggests so
  • అభిమానుల‌ను తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచిన చిత్ర టీజ‌ర్‌
  • వీఎఫ్ ఎక్స్‌, యానిమేష‌న్ నాసిర‌కంగా ఉండ‌టంతో టీజ‌ర్‌పై ట్రోలింగ్
  • ఈ విష‌యంలో ఓం రౌత్‌పై ప్ర‌భాస్ కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం
రాధేశ్యామ్‌తో భారీ డిజాస్ట‌ర్ ను ఖాతాలో వేసుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా న‌టించ‌గా.. ప్ర‌తినాయ‌క పాత్ర‌లో  సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడి పాత్ర పోషించాడు. కృతి స‌న‌న్ హీరోయిన్. భారీ అంచనాల నడుమ ఈనెల‌ 2న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే, వీఎఫ్ ఎక్స్, యానిమేషన్ నాసిర‌కంగా ఉన్నాయంటూ ఈ టీజ‌ర్ పై తీవ్ర విమర్శలు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. 

టీజ‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న త‌ర్వాత చాలా నిరుత్సాహ‌ప‌డ్డ ప్ర‌భాస్‌.. ద‌ర్శ‌కుడిపై  ఆగ్ర‌హంగా ఉన్నాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో  ప్రభాస్ కోపంగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో  అతను దర్శకుడు ఓం రౌత్‌ని తన గదికి రమ్మని అడగడం క‌నిపించింది. "ఓం, నువ్వు నా రూమ్‌కి వస్తున్నావ్ క‌దా. నాతో రా" అని ప్ర‌భాస్ వేలు చూపిస్తూ రౌత్‌కు చెప్పాడు. దాంతో, ప్రభాస్, ఓం రౌత్ మధ్య అంతా బాగాలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆదిపురుష్ టీజ‌ర్ ను విడుద‌ల చేసిన స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలుస్తోంది. అయితే, ఓ రౌత్‌తో ప్ర‌భాస్ ఏం మాట్లాడాడనే విష‌యం వెల్ల‌డి కాలేదు. 
Prabhas
adipurush
om rout
angry
teaser

More Telugu News