Team India: బుమ్రా స్థానంలో ష‌మీ... రిజ‌ర్వ్ బెంచ్‌లోకి సిరాజ్‌

Mohammed Shami replaces jaspreet bymrah in t20 world cup
  • వెన్ను నొప్పి కార‌ణంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు దూర‌మైన బుమ్రా
  • అధికారికంగా ప్ర‌క‌టించిన బీసీసీఐ
  • రిజ‌ర్వ్ బెంచ్ నుంచి బుమ్రా ప్లేస్‌లోకి ష‌మీ ఎంపిక‌
  • ష‌మీ ప్లేస్‌లో స్టాండ్‌బైగా సిరాజ్‌
ఆస్ట్రేలియా వేదిక‌గా త్వ‌ర‌లో ప్రారంభం కానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. వెన్ను నొప్పి కార‌ణంగా జ‌ట్టు నుంచి బుమ్రాను బీసీసీఐ త‌ప్పిస్తూ మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌టన చేసింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బుమ్రా ఆట‌పై చాలా రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా... మంగ‌ళ‌వారం అత‌డిని త‌ప్పిస్తూ బీసీసీఐ ప్ర‌క‌ట‌న చేసింది.

టీ20 వ‌రల్డ్ క‌ప్ నుంచి బుమ్రా త‌ప్పుకుంటే... అత‌డి స్థానంలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంద‌న్న దానిపైనా చాలా రోజులుగా పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. హైద‌రాబాద్‌కు చెందిన మ‌హ్మద్ సిరాజ్‌కు అవ‌కాశం ద‌క్కుతుందా? అంటూ వార్త‌లు వినిపించాయి. అయితే సిరాజ్ ఆశల‌పై నీళ్లు చ‌ల్లిన బీసీసీఐ... బుమ్రా స్థానంలో సీనియ‌ర్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని ఎంపిక చేసింది. ఇప్ప‌టిదాకా రిజ‌ర్వ్ బెంచ్‌లో ఉన్న ష‌మీ స్థానంలో సిరాజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
Team India
T20 World Cup
Jaspreet Bumrah
Mohammed Siraj
Mohammed Shami
BCCI

More Telugu News