బావ‌మ‌రిది షోకి అతిథిగా బావ గారు!... 'అన్‌స్టాప‌బుల్' గెస్ట్‌గా చంద్ర‌బాబు!

04-10-2022 Tue 19:40
  • బాల‌య్య హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాప‌బుల్‌
  • ఇప్ప‌టికే ముగిసిన అన్‌స్టాప‌బుల్ తొలి సీజ‌న్‌
  • మంగ‌ళ‌వారం విడుద‌లైన రెండో సీజ‌న్ టీజ‌ర్‌
  • అదే రోజు చంద్ర‌బాబుతో ఎపిసోడ్ షూటింగ్‌
  • చంద్ర‌బాబుతో పాటు స్టూడియోకు వ‌చ్చిన లోకేశ్
chandrababu attends aha unstoppable show as guest
టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా ప్ర‌సార‌మ‌వుతున్న 'అన్‌స్టాప‌బుల్' షోకి ఆయ‌న బావ‌, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు హాజ‌ర‌య్యారు. ఈ షోలో గెస్ట్‌గా హాజ‌రైన చంద్ర‌బాబుకు ఆహా అధినేత అల్లు అర‌వింద్‌తో పాటు ఆహా యూనిట్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికింది. ఈ ఫొటోల‌ను టీడీపీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.

అల్లు అర‌వింద్ ఆధ్వ‌ర్యంలోని ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో 'అన్‌స్టాప‌బుల్' పేరిట ఓ షోను ప్ర‌సారం చేస్తుండ‌గా... దానికి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ షో త‌న తొలి సీజ‌న్‌ను పూర్తి చేసుకోగా... త్వ‌ర‌లోనే రెండో సీజ‌న్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన టీజ‌ర్ మంగ‌ళవారం విడుద‌ల అయ్యింది. 'అన్‌స్టాప‌బుల్' సెకండ్ సీజ‌న్ లో భాగంగా ఓ ఎపిసోడ్‌లో చంద్ర‌బాబ గెస్ట్‌గా హాజ‌రు కానున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కోస‌మే చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం స్టూడియోకు వ‌చ్చారు. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ కూడా స్టూడియోకు వెళ్లారు.