Women Commission: శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ను అరెస్ట్ చేయాలంటూ మహిళా కమిషన్ ఆదేశాలు

Women Commission orders to file FIR on Srikalahasti CI
  • సీఐ అంజూ యాదవ్ వీడియో వైరల్
  • ఓ మహిళపై దౌర్జన్యం చేస్తున్నట్టుగా దృశ్యాలు
  • తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్
  • సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు
ఇటీవల శ్రీకాళహస్తిలో సీఐ అంజూ యాదవ్ ఆరోగ్య సమస్యలు ఉన్న ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శపాలైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా, సీఐ అంజూ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కొన్నిరోజుల కిందటే తిరుపతి ఎస్పీకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ను ప్రశ్నించారు. కావాలని దాడి చేయలేదంటూ సీఐ వివరణ ఇచ్చారు. తన వాదనలకు బలం చేకూర్చేలా ఓ ఆడియో విడుదల చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఆ మహిళ తన పట్ల అమర్యాదగా మాట్లాడిందని అంజూ యాదవ్ ఆరోపించారు. ఆమెను తాను కొట్టలేదని స్పష్టం చేశారు.
Women Commission
CI Anju Yadav
FIR
Arrest
DGP

More Telugu News