Telangana: మునుగోడు ఎన్నికల్లో మూకుమ్మ‌డి నామినేష‌న్లు ఖాయం... రెడీ అవుతున్న వీఆర్ఏలు

vras and others decided to file mass nominations in munugode Bypolls
  • స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రోజుల త‌ర‌బ‌డి నిరాహార దీక్ష‌లు చేస్తున్న వీఆర్ఏలు
  • ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా మునుగోడు ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు వేయాల‌ని నిర్ణ‌యం
  • వీఆర్ఏల బాట‌లోనే లారీ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్‌, భూ నిర్వాసితులు
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వర్గానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో భారీ ఎత్తున నామినేష‌న్లు దాఖ‌లు అయ్యే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రోజుల త‌ర‌బ‌డి నిరాహార దీక్ష‌లు చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లు ఉప ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబ స‌భ్యుల‌తో మూకుమ్మ‌డిగా నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. 

వీఆర్ఏల‌తో పాటు లారీ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్‌, భూ నిర్వాసితులు కూడా మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో మూకుమ్మ‌డిగా నామినేష‌న్లు వేసే దిశ‌గా క‌దులుతున్నారు. ఫ‌లితంగా మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భారీ సంఖ్య‌లో నామినేష‌న్లు దాఖ‌లు కానున్నాయి. గ‌తంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పోటీ చేసిన నిజామాబాద్ లోక్ స‌భ స్థానానికి ప‌సుపు రైతులు పెద్ద సంఖ్య‌లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
Telangana
Munugode Bypoll
VRA
Lorry Drivers Association
Mass Nominations

More Telugu News