Andhra Pradesh: ఆస్ట్రేలియాలో అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ మంత్రి కాకాణి... కేంద్ర మంత్రి షెకావ‌త్‌తో భేటీ

ap minister kakani govardhan reddy reached Adelaide to attend a international summit
  • ఆడిలైడ్‌లో రేప‌టి నుంచి అంత‌ర్జాతీయ స‌ద‌స్సు 
  • నీటిపారుద‌ల‌, వ్య‌వ‌సాయ రంగాల‌పై కొన‌సాగ‌నున్న స‌ద‌స్సు
  • ఏపీ ప్ర‌తినిధిగా కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాజ‌రు
  • రెండు రంగాల‌పై షెకావ‌త్‌తో కాకాణి చ‌ర్చ‌లు
ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో నీటిపారుద‌ల, వ్య‌వ‌సాయ రంగాల‌పై రేప‌టి నుంచి జ‌ర‌గ‌నున్న అంత‌ర్జాతీయ స‌దస్సులో పాల్గొనే నిమిత్తం ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ స‌ద‌స్సుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ కూడా హాజ‌ర‌య్యారు. 

స‌ద‌స్సుకు ఓ రోజు ముందే ఆడిలైడ్ చేరుకున్న కాకాణి...అప్ప‌టికే ఆ న‌గ‌రానికి చేరుకున్న షెకావ‌త్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నీటిపారుద‌ల‌, వ్య‌వ‌సాయ రంగాల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు.
Andhra Pradesh
Kakani Govardhan Reddy
YSRCP
Australia
Gajendra Singh Shekhawat
BJP
Adelaide

More Telugu News