ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

  • భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ
  • క్వాంటమ్ ఫిజిక్స్ లో వినూత్న ఆవిష్కరణ
  • అలైన్ ఆస్పెక్ట్, క్లాసెర్, జెల్లింగర్ లకు నోబెల్
  • రూ.7.34 కోట్ల నగదు బహుమతి
Three scientists wins Noble Prize in Physics

రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ను ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను ఈ విశిష్ట బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు అందించనుంది. భౌతికశాస్త్రంలో వినూత్న పరిశోధనలకు గాను అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్ లకు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ నేడు ప్రకటించింది. 

క్వాంటమ్ సమాచార శాస్త్రానికి కొత్త దారులు తెరుస్తూ, బెల్ అసమానతలకు అతీతంగా ఫోటాన్లతో వారు సాగించిన పరిశోధనలకు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఇస్తున్నామని అకాడమీ వెల్లడించింది. 

రెండు కణాలు ఒకదానికొకటి వేరుపడినప్పటికీ, పరస్పరం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ అవి రెండూ ఏకశక్తిగా వ్యవహరించడాన్ని ఈ శాస్త్రవేత్తల త్రయం కనుగొందని, ఈ సమాచారం ఆధారంగా సరికొత్త క్వాంటం టెక్నాలజీకి ఈ ఫలితాలు బాటలు వేశాయని పేర్కొంది. కాగా, నోబెల్ ప్రైజ్ లో భాగంగా రూ.7.34 కోట్ల నగదు బహుమతి అందించనున్నారు.

More Telugu News