KCR: దేశ్ కీ నేతా కేసీఆర్... లండన్ బ్రిడ్జ్ వద్ద ఎన్నారైలు

  • కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటున్న యూకే ఎన్నారైలు
  • దేశాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని వ్యాఖ్య
  • లండన్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్ ప్రదర్శన
KCR cutout near London bridge

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీపైనే ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని యూకేలో ఉన్న ఎన్నారైలు కూడా ఆకాంక్షిస్తున్నారు. లండన్ లోని చారిత్రక లండన్ బ్రిడ్జ్ వద్ద ఎన్నారైలు సమావేశమయ్యారు. 'దేశ్ కీ నేత కేసీఆర్' అంటూ వారు నినాదాలు చేశారు. తెలంగాణ ఎన్నారైలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నారైలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. 

ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందని అన్నారు. ఇండియా అభివృద్ధి చెందాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్ భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News