English Vinglish: వేలానికి నటి శ్రీదేవి కట్టిన చీర

  • ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాకు అక్టోబర్ 10తో పదేళ్లు
  • అందులో శ్రీదేవి ధరించిన చీరల వేలం
  • ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు డైరెక్టర్ షిండే ప్రణాళిక
Sridevi sarees from English Vinglish to be auctioned as film completes 10 years

చీరకట్టులో నటి శ్రీదేవి అందాన్ని వర్ణించలేం. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి.. ఇంగ్లిష్ వింగ్లిష్ లో చీరకట్టును ఓసారి గుర్తు చేసుకోండి. 1997లో నటనకు విరామం చెప్పి.. తిరిగి 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ తోనే శ్రీదేవి అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు.

పదేళ్ల వేడుకను నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఇంగ్లిష్ వింగ్లిష్ లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లింష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించింది. ఇంగ్లిష్ ప్రావీణ్యం కోసం ఆమె ఎన్ని పాట్లు పడిందన్నది సినిమాలో చూడొచ్చు.

More Telugu News