Redmi Pad: తక్కువ ధరకే విడుదలైన రెడ్ మీ ప్యాడ్

Redmi Pad launched in India with introductory price of Rs 12999
  • 5వ తేదీ నుంచి ఎంఐ, ఫ్లిప్ కార్ట్ పోర్టళ్లలో విక్రయాలు
  • మూడు రకాల వేరియంట్లుగా లభ్యం
  • రూ.12,999 నుంచి రూ.19,999 మధ్య ధరలు
షావోమీకి చెందిన రెడ్ మీ.. భారత మార్కెట్లోకి రెడ్ మీ ప్యాడ్ (టాబ్లెట్)ను విడుదల చేసింది. 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.12,999. మొత్తం మూడు వేరియంట్లుగా రానుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.14,999. 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ధర రూ.19,999. రెడ్ మీ ప్యాడ్ విక్రయాలు రేపటి నుంచి (5వ తేదీ) ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్ పై మొదలవుతాయి.

గ్రాఫైట్ గ్రే, మూన్ లైట్ సిల్వర్, మింట్ గ్రీన్ రంగుల్లో ఇది లభిస్తుంది. 10.61 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 90హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. టాబ్లెట్ లో 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఇదే మొదటిసారి. వీడియోకాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్ ఉంటుంది. స్ప్లిట్ స్క్రీన్, ఫ్లోటింగ్ విండోస్, మల్టీ విండో సపోర్ట్, రీడింగ్ మోడ్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీని 22.5 వాట్ చార్జర్ తో రీచార్జ్ చేసుకోవచ్చు.
Redmi Pad
launched
India
price of Rs 12999

More Telugu News