Lottery: మర్చిపోయి మూడు టికెట్లు కొంటే.. మూడింటికీ లాటరీ తగిలి కోటీశ్వరులైపోయారు!

Man accidentally buy three tickets and won prize on all three
  • అమెరికాలో వృద్ధ దంపతులను వరించిన అదృష్టం
  • ఒక టికెట్ కొన్న విషయం మర్చిపోయి మరో టికెట్ కొన్న భర్త
  • ఆయన కొన్న విషయం తెలియక ఇంకో లాటరీ టికెట్ తీసుకున్న భార్య
  • తన భార్య పుట్టినరోజును తలపించేలా తీసుకుంటే లాటరీ తగిలిందని భర్త వెల్లడి
అదృష్టం కలిసొస్తే ఏం చేసినా డబ్బులు వచ్చిపడతాయన్నది సామెత. అమెరికాలోని వృద్ధ దంపతులకు అలాగే అదృష్టం వరించింది. ఏమరుపాటుతో మర్చిపోయి కొన్న మూడు లాటరీ టికెట్లలో మూడింటికీ లాటరీ తగిలింది. ఆ మూడు కూడా ఒకేసారి డ్రా తీసిన లాటరీవి కావడం మరింత విశేషం. మూడింటికీ కలిపి లక్షన్నర డాలర్ల బహుమతి వచ్చింది. అంటే మన కరెన్సీలో కోటీ 20 లక్షల రూపాయలపైనే.

భార్యభర్త వేరుగా కొని..
అమెరికాలోని టోసన్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల పెద్దాయన.. మేరీలాండ్‌ లాటరీకి సంబంధించి రెండు టికెట్లు కొన్నారు. ఆ సమయంలో ఆయనకు చిన్న సర్జరీ అవసరం ఉండటంతో చికిత్స కోసం వెళ్లారు. ఆ కుటుంబానికి అప్పుడప్పుడూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉండటంతో.. తన భర్త కొన్నాడో లేదో అని భార్య కూడా అదే లాటరీకి సంబంధించి మరో టికెట్ కొనుగోలు చేసింది. సర్జరీ పూర్తయిన తర్వాత వారు.. తమ లాటరీ టికెట్ల పరిస్థితి ఏమిటో చూసుకున్నారు. చిత్రంగా మూడు లాటరీ టికెట్లకూ బహుమతి తగిలింది.

భార్య పుట్టిన రోజును తలపించేలా
లాటరీ తగిలిన దంపతులు వారి పేర్లను ప్రచురించడానికి ఇష్టపడలేదు. అయితే తన భార్య పుట్టిన రోజును తలపించేలా ఉన్న నంబర్లతో లాటరీ టికెట్లు కొన్నామని.. వాటికి బహుమతి తగిలిందని సదరు పెద్దాయన ఆనందంగా చెప్తున్నారు. మూడింటికీ లాటరీ తగిలిన విషయాన్ని తొలుత నమ్మలేదని పేర్కొన్నారు.
Lottery
USA
Offbeat

More Telugu News