గులాబ్ జామున్ల డబ్బాను అనుమ‌తించ‌ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది... వాటిని ప్ర‌యాణికుడు ఏం చేశాడంటే?

  • ఫుకెట్ విమానాశ్ర‌యంలో భార‌త ప్ర‌యాణికుడి గులాబ్ జామున్ల డ‌బ్బాను అడ్డుకున్న సిబ్బంది
  • డ‌బ్బా తెరిచి అక్క‌డి అధికారుల‌కు పంచిన ప్రయాణికుడు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసిన వీడియోకు విశేష స్పంద‌న‌
Passenger was stopped from carrying gulab jamuns at Phuket airport Viral video shows what he did next

విమానాశ్ర‌యాల్లో సెక్యూరిటీ చెక్-ఇన్ సమయంలో ప్ర‌యాణికులు విధిలేని పరిస్థితుల్లో త‌మ ల‌గేజీ నుంచి కొన్ని వ‌స్తువులు తీసేసే సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ చూస్తుంటాం. ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి. విమానాల్లోకి అనుమ‌తించ‌ని ఆహార ప‌దార్థాల‌ను తీసుకెళ్లిన వారు చెన్ ఇన్ స‌మ‌యంలో వ‌దిలేసి వెళ్తుంటారు. ఇలాంటి అనుభ‌వ‌మే మ‌న దేశానికి చెందిన హిమాన్షు దేవ్‌గన్ కు ఫుకెట్ విమానాశ్ర‌య‌ంలో ఎదురైంది. చెక్ ఇన్ స‌మ‌యంలో అత‌ని ల‌గేజీతో పాటు ఉన్న గులాబ్ జామున్ల డబ్బాను లోప‌లికి తీసుకెళ్ల‌డానికి భ‌ద్ర‌తా సిబ్బంది అనుమ‌తించ‌లేదు. అయితే, ఆ డ‌బ్బాను డ‌స్ట్ బిన్‌లో ప‌డేయ‌కుండా, అక్క‌డే వ‌దిలేయ‌కుండా అత‌ను చేసిన ప‌ని అందరినీ ఆకట్టుకుంటోంది. 

సెక్యూరిటీ సిబ్బంది వ‌ద్ద‌న్న గులాబ్ జామున్ల డబ్బాను అక్క‌డే తెరిచి వాటిని అక్క‌డి సిబ్బందికి తినిపించాడు. తియ్య‌టి గులాబ్ జామున్లు తిని అధికారులు ఇచ్చిన రియాక్ష‌న్ల‌ను రికార్డు చేశాడు. ఈ మొత్తం వీడియోను హిమాన్షు త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్ అయింది. ఈ వీడియోకు ఒక మిలియన్ కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. “సెక్యూరిటీ చెక్‌లో గులాబ్ జామున్‌లను తీసుకెళ్ల‌డానికి అనుమ‌తించ‌లేదు. దాంతో, మేము మా ఆనందాన్ని వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. మేం భార‌తీయులం” అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. హిమాన్షు చేసిన ప‌నిని నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు.

More Telugu News