West Bengal: పశ్చిమ బెంగాల్‌లో వ్యాపారుల జాక్‌పాట్.. దసరా వేడుకల్లో రూ. 40 వేల కోట్ల వ్యాపారం!

Rs 40cr worth business in west bengal in festival season
  • పశ్చిమ బెంగాల్‌లో 40 వేల దుర్గా మండపాల ఏర్పాటు
  • ఒక్క కోల్‌కతాలోనే 3 వేలకుపైగా మండపాలు
  • మూడు లక్షల మందికి దొరికిన ఉపాధి 
  • ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు వ్యాపారం సాగుతుందన్న ఎఫ్ఎఫ్‌డీ చైర్మన్ పార్థా ఘోష్
దసరా వేడుకలకు పెట్టింది పేరైన పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది రూ. 40 వేల కోట్ల వ్యాపారం జరిగినట్టు ఫోరమ్ ఫర్ దుర్గా స్తాబ్ (ఎఫ్ఎఫ్‌డీ) తెలిపింది. దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు లావాదేవీలు జరుగుతాయని ఆ సంస్థ చైర్మన్ పార్థో ఘోష్ తెలిపారు. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మండపాలు ఏర్పాటైనట్టు చెప్పారు. ఒక్క కోల్‌కతా నగరంలోనే ఇవి మూడు వేలకు పైగా ఉన్నట్టు పేర్కొన్నారు. దసరా వేడుకల సందర్భంగా దాదాపు 3 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. 

దసరా ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారని పార్థా ఘోష్ తెలిపారు. వీరిలో మండపాలు నిర్మించేవారు, విగ్రహాలు తయారుచేసేవారు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్ సేవలందించేవారు ఉంటారని ఆయన వివరించారు. ఉత్సవాల సందర్భంగా వీరందరికీ ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
West Bengal
Kolkata
Durga Pandal
FFD

More Telugu News