Teppotsavam: కృష్ణా నదికి వరద ... దసరా రోజున విజయవాడలో దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు!

  • పులిచింతల నుంచి భారీగా వరద నీరు
  • 30 వేల క్యూసెక్కుల లోపు నీరు ఉంటేనే తెప్పోత్సవానికి అనుమతి
  • ఇరిగేషన్ అనుమతి ఇంకా రాలేదన్న మంత్రి సత్యనారాయణ
More flood water towards Vijayawada Prakasam Barrage

ప్రతి ఏటా దసరా సందర్భంగా విజయవాడ వద్ద కృష్ణా నదిలో కనకదుర్గమ్మ తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుండడంతో దసరా రోజున దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అనిశ్చితి ఏర్పడింది. 

ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 30 వేల క్యూసెక్కుల లోపు నీరు ఉంటేనే తెప్పోత్సవం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో, అమ్మవారి జలవిహారంపై రేపు అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 

కాగా, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, దుర్గమ్మ తెప్పోత్సవానికి జలవనరుల శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదని వెల్లడించారు. దసరా రోజున వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే, కనకదుర్గ అమ్మవారితో కూడిన హంస వాహనాన్ని నదిలో ఒకే చోట నిలిపి ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

More Telugu News