Errabelli: కేసీఆర్ జాతీయ పార్టీతో ఇతర రాష్ట్రాల రాజకీయ సమీకరణాల్లో కూడా మార్పులు వస్తాయి: ఎర్రబెల్లి

KCR national party will bring changes in all states says Errabelli
  • ఇతర రాష్ట్రాల్లోని అసంతృప్తులు బయటకు వస్తారు
  • రాష్ట్రానికి ఒక ఎంపీ, ఎమ్మెల్యే గెలిచినా లక్ష్యం చేరుకున్నట్టే
  • జాతీయ స్థాయిలో మార్పు కచ్చితంగా వస్తుంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన జాతీయ పార్టీ జెండా, అజెండాకు సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు. ఫామ్ హౌస్ వేదికగా పార్టీ కీలక నేతలు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తదితరులతో చర్చిస్తున్నారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీతో ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల్లో సైతం మార్పులు వస్తాయని చెప్పారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ పార్టీల్లోని అసంతృప్తులు బయటకు వస్తారని అన్నారు. 

కేసీఆర్ జాతీయ పార్టీతో ఏదో సాధించకపోయినా... మార్పు మాత్రం కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే గెలిచినా... జాతీయ పార్టీ లక్ష్యం అందుకున్నట్టేనని చెప్పారు. మరోవైపు ఈ నెల 5న జరగనున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ గురించి పార్టీ నేతలకు కేసీఆర్ వివరించనున్నారు.

  • Loading...

More Telugu News