IT Companies: ఫ్రెషర్స్ కు షాకిస్తున్న ఐటీ కంపెనీలు

  • ఆఫర్ లెటర్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగాల్లోకి తీసుకోని వైనం
  • ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు మెయిల్స్ పంపుతున్న కంపెనీలు
  • రాబోయే రోజుల్లో లేఆఫ్స్ కూడా ఉండొచ్చనే అనుమానాలు
IT companies rejecting offer letters to freshers

ఫ్రెషర్స్ కు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. ఆఫర్ లెటర్లను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఫ్రెషర్లు లబోదిబోమంటున్నారు. కొన్ని నెలల కిందట ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నామని... పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత తమకు ఆఫర్ లెటర్లు ఇచ్చారని, ఉద్యోగాల్లో చేరేందుకు తాము ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో... ఆఫర్ లెటర్లను రద్దు చేసినట్టు తమకు లెటర్స్ వచ్చాయని వారు అంటున్నారు. కంపెనీ మార్గదర్శకాలు, అర్హతా నిబంధనల కారణంగా ఆఫర్ లెటర్లను రద్దు చేసినట్టు చెపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు, ఆర్థికమాంద్యం భయాందోళనలు, ఐటీ రంగంలో మందగమనం, కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగానే ఐటీ కంపెనీలు ఇలా చేస్తున్నాయిని తెలుస్తోంది. వడ్డీ రేట్ల పెంపు, మార్కెట్లలో లిక్విడిటీ తగ్గడం ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం హైరింగ్ ను నిలిపివేసినట్టు సమాచారం. దీంతో, రాబోయే రోజుల్లో లేఆఫ్స్ కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News