motorola: మోటోరోలా నుంచి జీ72 స్మార్ట్ ఫోన్ విడుదల

  • దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం
  • ఆరంభ ఆఫర్ కింద రూ.14,999కే విక్రయం
  • బ్యాంకు కార్డుపై రూ.1,000 తగ్గింపు
  • పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.3,000 ప్రత్యేక డిస్కౌంట్
Moto G72 launched in India with 108MP triple rear camera system

మోటోరోలా జీ72 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కాకపోతే ఇది 4జీ స్మార్ట్ ఫోన్. 5జీకి సపోర్ట్ చేయదు. జీ72లో ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 6.6 అంగుళాల పీవోఎల్ఈడీ పంచ్ హోల్ డిస్ ప్లే, 576 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, అధిక రిజల్యూషన్ వీడియోల స్ట్రీమింగ్ కు వీలుగా హెచ్ డీఆర్ 1 ప్లస్ సర్టిఫికేషన్, 108 మెగాపిక్సెల్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి.

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్ తో పని చేయనుంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుంది.  మెటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ముందుగా భారత మార్కెట్లోనే విడుదలైంది. తర్వాత ఇతర మార్కెట్లలో దీన్ని మోటోరోలా విడుదల చేయనుంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,999. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే, పాత్ ఫోన్ ఎక్సేంజ్ పై రెగ్యులర్ ధరకు అదనంగా రూ.3,000 ఎక్కువ లభిస్తుంది.

More Telugu News