Iran Flight: ఢిల్లీకి చేరువలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు... అధికారులు అప్రమత్తం

  • టెహ్రాన్ నుంచి గ్వాంగ్ జౌ వెళుతున్న విమానం
  • భారత్ గగనతలంలోకి ప్రవేశం
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నం
  • జైపూర్ మళ్లించిన భారత అధికారులు
  • ల్యాండింగ్ కాకుండా ప్రయాణాన్ని కొనసాగించిన విమానం
Iran flight faced bomb threat in midair near New Delhi

ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్ జౌ వెళుతున్న విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో బాంబు బెదిరింపు ఎదుర్కొంది. దాంతో భారత్ లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ సమయంలో ఇరాన్ విమానం ఢిల్లీకి చేరువలో ఉంది.

తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందంటూ ఆ విమాన పైలెట్ ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. అయితే, అధికారులు ఆ విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలని సూచించారు. అటు, భారత వాయుసేన కూడా వెంటనే స్పందించి ఆ విమానానికి రక్షణగా రెండు యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. 

అయితే ఆ ఇరాన్ విమాన పైలెట్ జైపూర్ లో ల్యాండింగ్ చేయకుండా, భారత గగనతలాన్ని వీడి ప్రయాణాన్ని కొనసాగించాడు. కాగా, ఆ విమానాన్ని ఓ ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ట్రాక్ చేయగా, చైనా గగనతలంలో ఉన్నట్టు వెల్లడైంది.

More Telugu News