మంచి ఫీచర్లతో విడుదలైన వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్

03-10-2022 Mon 13:45 | Technology
  • దీని ధర రూ.4,999
  • వన్ ప్లస్ పోర్టల్, అమెజాన్ లో విక్రయాలు
  • రూ.500 మేర ఆరంభ డిస్కౌంట్
OnePlus Nord Watch launched in India with water resistant rating up to 10 days battery life
స్మార్ట్ వాచ్ అభిరుచి కలిగిన వారి కోసం మరో కొత్త వాచ్ వచ్చేసింది. వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. దీని ధర రూ.4,999. వన్ ప్లస్ డాట్ ఇన్ లో ఇప్పటికే విక్రయాలు ఆరంభమయ్యాయి. అమెజాన్ పోర్టల్ పై ఈ నెల 4వ తేదీ నుంచి ఇది విక్రయాలకు అందుబాటులోకి రానుంది. దీంతో బడ్జెట్ ధరల వాచ్ సెగ్మెంట్లోకి వన్ ప్లస్ ఎంట్రీ ఇచ్చినట్లయింది. 

ఈ వాచ్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి. నిద్ర తీరును ట్రాక్ చేస్తుంది. రోజులో ఎన్ని అడుగులు నడిచారన్నది లెక్కిస్తుంది. హార్ట్ రేట్ ను మానిటర్ చేస్తుంది. 1.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 60 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 500 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. డయల్ రెక్టాంగిల్ ఆకారంలో ఉంటుంది. ఫోన్ కు వచ్చే నోటిఫికేషన్లను ఈ వాచ్ లోనే చూసుకోవచ్చు. మ్యూజిక్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎన్ హెల్త్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని, దీన్నుంచి స్మార్ట్ వాచ్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజులు వస్తుందని కంపెనీ చెబుతోంది. 

రోజువారీగా ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నామనే సమాచారం తెలుసుకోవచ్చు. 105 రకాల ఫిట్ నెస్ మోడ్స్ ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ తో వస్తుంది. స్ట్రెస్ ఏ స్థాయిలో ఉంది? ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉందన్నదీ చూడొచ్చు.  యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 ప్రత్యేక తగ్గింపును వన్ ప్లస్ సంస్థ ఇస్తోంది. అమెజాన్ పోర్టల్ పై కొనుగోలు చేసే వారు ఐసీఐసీఐ కార్డు ద్వారా ఈ రూ.500 తగ్గింపును పొందొచ్చు.