Balakrishna: బాలయ్య 'అన్ స్టాపబుల్' నుంచి రేపు టీజర్ రిలీజ్!

  • గతంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న 'అన్ స్టాపబుల్'
  • త్వరలో పలకరించనున్న 'అన్ స్టాపబుల్ 2'
  • విజయవాడ వేదికగా టీజర్ లాంచ్ 
  • ముగింపు దశలో గోపీచంద్ మలినేని మూవీ
  • త్వరలో మొదలుకానున్న అనిల్ రావిపూడి సినిమా 
Unstopable 2 update

బాలకృష్ణ వ్యాఖ్యాతగా గతంలో 'ఆహా'లో వచ్చిన 'అన్ స్టాపబుల్' కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మోహన్ బాబుతో చేసిన ఫస్టు ఎపిసోడ్ నుంచి మహేశ్ బాబుతో చేసిన చివరి ఎపిసోడ్ వరకూ కూడా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. నిర్మాతగా అల్లు అరవింద్ కి గల పేరుప్రతిష్ఠల కారణంగా ఆయన ఎవరిని అనుకుంటే వారిని ఈ షోకి తీసుకుని రాగలిగారు. బాలకృష్ణ అడిగే ముక్కుసూటి ప్రశ్నలే ఈ షోను అమాంతం పైకి లేపాయి. 

అలాంటి ఈ షోకి సీజన్ 2 మొదలు కానుందనే టాక్ కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ షోకి సంబంధించిన టీజర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. విజయవాడ వేదికగా టీజర్ ను వదలనున్న విషయాన్ని తెలియజేస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సారి ఈ షోను మరింత కొత్తగా డిజైన్ చేశారనే విషయం పోస్టర్ ను చూస్తుంటేనే అర్థమవుతోంది. 

మరి ఈ సారి ఎవరెవరు ఈ వేదికపై సందడి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య సినిమాల విషయానికి వస్తే, గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

More Telugu News