మెగాస్టార్ నన్ను గుర్తుపెట్టుకోవడమే గొప్ప విషయం: 'స్వాతిముత్యం' హీరో!

  • ప్రేమ కథా చిత్రంగా 'స్వాతి ముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • ఈ నెల 5వ తేదీన విడుదలవుతున్న సినిమా
Swathimuthyam Pre Release Event

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. 

ఈ వేదికపై బెల్లంకొండ గణేశ్ మాట్లాడుతూ .. " ఒక మంచి బ్యానర్ లో ... మంచి కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను హీరోను కావాలనే నిర్ణయానికి రాగానే నా కుటుంబ సభ్యులంతా సపోర్టు చేశారు. అందుకు వాళ్లకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను హీరో కావాలని మా మదర్ కి ఉండేది. తను ఈ సినిమా చూసి గర్వపడుతుందని నేను భావిస్తున్నాను. 

దసరా పండుగకి ఎన్ని సినిమాలు వచ్చినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి దసరాకి మా సినిమా వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన సినిమా రోజునే నా సినిమా వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News