ప్రభాస్ 'ఆదిపురుష్' అఫిషియల్ టీజర్ ఇదిగో!

02-10-2022 Sun 20:11
  • ప్రభాస్ హీరోగా ఆదిపురుష్
  • ఓమ్ రౌత్ దర్శకత్వంలో చిత్రం
  • ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో టీజర్ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన ప్రభాస్, కృతి సనన్
Prabhas Adipurush official teaser out now
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో నిర్వహించిన ఈవెంట్ లో టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ హాజరయ్యారు. 

"భూమి కుంగినా, నింగి చీలినా... న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం" అంటూ ప్రభాస్ గంభీరంగా పలికిన డైలాగ్ తో టీజర్ ఆరంభమవుతుంది. ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలు పోషించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఈ భారీ చిత్రానికి 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది.

కాగా, టీజర్ లో ప్రధాన పాత్రలన్నీ యానిమేటెడ్ క్యారెక్టర్లుగా కనిపిస్తున్నాయి. టీజర్ చూస్తుంటే 'ఆదిపురుష్' ఓ యానిమేషన్ చిత్రమా అనిపించేలా ఉంది.