కాలిఫోర్నియా పాఠశాలలో 'నాటు నాటు' కొట్టుడు... వీడియో పంచుకున్న లిరిక్ రైటర్ చంద్రబోస్

02-10-2022 Sun 15:56
  • ఆర్ఆర్ఆర్ లో సూపర్ హిట్టయిన నాటు నాటు సాంగ్
  • కీరవాణి బాణీలకు చంద్రబోస్ సాహిత్యం
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
Chandrabose shared a video of California school children sings Naatu Naatu song from RRR
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయస్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని బలంగా చాటింది. కాగా, ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా, 'నాటు నాటు' అనే సాంగ్ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటోంది. కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. 

తాజాగా ఈ పాటను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ పాఠశాలలో విద్యార్థులు ఆలపించిన వీడియోను లిరిక్ రైటర్ చంద్రబోస్ పంచుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాట పూర్తి సాహిత్యాన్ని ఆ విద్యార్థులు ఆలపించడం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఆ విద్యార్థులు ప్లెజెంటన్ ప్రాంతంలోని థామస్ హార్ట్ మిడిల్ స్కూల్ కు చెందినవారు.