చింతకాయల విజయ్ పై చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి మేరుగు నాగార్జున

  • సోషల్ మీడియా పోస్టుల దుమారం
  • చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు
  • చిన్నపిల్లలను బెదిరించారని టీడీపీ ఆరోపణలు
  • మీడియాలోనూ కథనాలు
  • స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున
Minister Merugu Nagarjuna reacts to media stories over Chintakayala Vijay issue

చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు బీభత్సం సృష్టించారంటూ మీడియాలో వచ్చిన కథనాలు సరికాదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎల్లో మీడియా చేసేది జర్నలిజమేనా అంటూ మండిపడ్డారు. తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సీఐడీ పోలీసులు వెళితే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఒక స్త్రీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఈ మీడియా ఎలా సమర్థిస్తుంది? అని ప్రశ్నించారు. 

చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని, ఐటీడీపీలో అతడి పోస్టులు దారుణంగా ఉంటాయని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన పనులకు చంద్రబాబు, లోకేశ్ వంతపాడుతున్నారని ఆరోపించారు. చింతకాయల విజయ్ పై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

More Telugu News