Drugs: ముంబయిలో రూ.1476 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

  • విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో డ్రగ్స్ అక్రమ రవాణా
  • 207 కిలోల హై ప్యూరిటీ డ్రగ్స్ స్వాధీనం
  • డ్రగ్స్ దిగుమతిదారును అరెస్ట్ చేసిన డీఆర్ఐ
  • డ్రగ్స్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు అనుమానం
Huge amount of drugs seized in Mumbai

భారత్ లో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నవీ ముంబయిలో 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ ను వాలెన్షియా రకం విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో ఉంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. 

కాగా, ఈ హై ప్యూరిటీ డ్రగ్స్ తీసుకున్నవారికి ఆ మత్తు 12 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 

ఈ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ కోసం, స్థానిక మాదకద్రవ్యాల నెట్ వర్క్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News